200 కోట్ల క్లబ్ లో అవెంజర్స్ ఎండ్ గేమ్ !

avengers2

హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ప్రస్తుతం ఇటు సౌత్ లో అటు హిందీలో పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టుకుంటుంది. మొదటి వారాంతంలో 187కోట్ల వసూళ్లను రాబట్టిన ఈచిత్రం నిన్న వీక్ డే లో కూడా అదే జోరును కొనసాగించింది.

ఫలితంగా ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే 224.50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం. ఇక అలాగే ఈచిత్రం ఇండియాలో బాహుబలి 2 , 2.0 తరువాత అతి తక్కువ సమయంలో 200కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఫుల్ రన్ లో ఈచిత్రం ఇండియాలో 350 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తో ఈ చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లైఫ్ టైం ఇండియన్ గ్రాస్ (228కోట్లు) ను క్రాస్ చేయనుంది.

Exit mobile version