అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ రికార్డ్ కలెక్షన్స్!

అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ రికార్డ్ కలెక్షన్స్!

Published on May 6, 2018 11:00 AM IST

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ కలెక్షన్స్ లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సినీ పండితులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు ఇండియాలో బాలీవుడ్ సినిమాలు కూడా అందుకొని క్రేజ్ ని ఈ సినిమా చాలా వేగవంతంగా అందుకుంది. విడుదలైన మొదట్లోనే సినిమా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లను క్రాస్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండవవారం అయితే సినిమా పాజిటివ్ టాక్ తో ఇంకా ఎక్కువ స్థాయిలో ఆదరణను అందుకుంటోంది.

సినిమా రెండవ వారం కలెక్షన్స్ ని చుస్తే క్రేజ్ ఏ రేంజ్ లో పెరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 164 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి ఈ ఏడాది అత్యధిక వేగంగా ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా నిలిచింది. అవెంజర్స్:ఇన్ఫినిటీ వార్ కి దరిదాపుల్లో పెద్ద సినిమాలు ఇంకా ఏవి పోటీకి లేకపోవడంతో ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 200 కోట్ల బాక్స్ ఆఫీస్ మార్క్ ఈజీగా దాటేస్తుందనే టాక్ వస్తోంది. మరి సినిమా ఆ రేంజ్ లో వసూలు చేస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు