మార్చి 6న భయపెట్టడానికి వస్తున్న ‘అవును 2’

మార్చి 6న భయపెట్టడానికి వస్తున్న ‘అవును 2’

Published on Feb 12, 2015 2:30 PM IST

avunu-2
ఎప్పటికప్పుడు సరికొత్త కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించే దిరేచ్తో రవిబాబు. నటుడు మరియు డైరెక్టర్ అయిన రవిబాబు తన హర్రర్ మూవీ ‘అవును2’ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు . హర్షవర్ధన్ రాణే, పూర్ణ జంటగా నటించిన చిత్రం ‘అవును’. 2012లో విడుదలైన సక్సెస్ అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన సినిమానే ‘అవును 2’.

చాలా రోజుల క్రితమే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని పలు సార్లు మార్చి 6న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసుకున్నారు. ‘అవును 2’లో హర్షవర్ధన్ రాణే, పూర్ణలతో పాటు సంజన, నికిత ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌, సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చాలా లో బడ్జెట్ తో తెరకెక్కిన అవును సినిమా నిర్మాతలకి మంచి లాభాన్ని తెచ్చి పెట్టాయి. ఆ సినిమాలానే ఈ సినిమా కూడా హిట్ అయ్యి మంచి లాభాలను తెచ్చి పెతుతుందని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం భావిస్తోంది.

తాజా వార్తలు