పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క అలాగే తమన్నా భాటియా హీరోయిన్స్ గా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రమే బాహుబలి. పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని సెట్ చేసిన ఈ సినిమా రెండు భాగాలూ కలిపి ఒక్క సినిమాగా బాహుబలి ది ఎపిక్ అంటూ ఈ ఏడాది రీరిలీజ్ అయ్యి మళ్ళీ భారీ హిట్ అయ్యింది. 50 కోట్లకి పైగా గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలో ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది.
ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచి కేవలం హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇది మాత్రం ఒకింత ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి. హిందీ కంటే ఎక్కువగా తెలుగులో ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. అలాంటిది కేవలం హిందీ లోనే రావడం అనేది ఫ్యాన్స్ కి డిజప్పాయింట్ అంశంగా మారింది. మరి తెలుగు రిలీజ్ పై ఓ క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
