రమణ గాడి మాస్ కి మరోసారి సిద్ధమా.. అవైటెడ్ ట్రీట్ కి డేట్ ఫిక్స్

రమణ గాడి మాస్ కి మరోసారి సిద్ధమా.. అవైటెడ్ ట్రీట్ కి డేట్ ఫిక్స్

Published on Feb 29, 2024 7:03 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన సాలీడ్ మాస్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి మిక్స్డ్ టాక్ తో కూడా మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ లు రీజనల్ గా భారీ రికార్డులు సెట్ చేశారు. అయితే ఈ సినిమా మ్యూజికల్ గా కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన స్కోర్ కి కానీ పాటలకి కానీ మెల్లగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక రమణ పాత్రని హైలైట్ చేస్తూ ఇచ్చిన మాస్ స్కోర్ కానీ సినిమాలో ఎమోషనల్ ట్రాక్స్ కానీ సినిమా చూశాక చాలా మందికి విపరీతంగా నచ్చాయి. అయితే ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్(ఓఎస్టీ) కోసం ఎప్పుడు నుంచో ఎదురు చూస్తుండగా ఫైనల్ గా దీనిపై సంగీత దర్శకుడు థమన్ అదిరే క్లారిటీ అందించాడు.

సినిమా అవైటెడ్ ఓఎస్టీ ని ఈ మార్చ్ 9 న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. దీనితో మరోసారి మహేష్ ఫ్యాన్స్ కి క్రేజీ ట్రీట్ రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జైరాం తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు