“హను మాన్” అవైటెడ్ స్పెషల్ సాంగ్ వచ్చేసింది.. కానీ

“హను మాన్” అవైటెడ్ స్పెషల్ సాంగ్ వచ్చేసింది.. కానీ

Published on Feb 20, 2024 6:40 PM IST


టాలీవుడ్ సినిమా దగ్గర ఒక సంచలన హిట్ చిత్రాల్లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సూపర్ హీరో చిత్రం “హను మాన్” కూడా ఒకటి. భారీ పోటీ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం హీరో తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మల కెరీర్ లోనే ఒక గేమ్ ఛేంజింగ్ హిట్ గా నిలవగా ఈ సినిమా కొనుగోలు చేసిన బయ్యర్లకు భారీ లాభాలు అందించింది. మరి ఈ సినిమాని ఈ రేంజ్ లో నిలబెట్టిన క్రేజీ అంశాల్లో క్లైమాక్స్ పార్ట్ రఘునందన సాంగ్ కూడా ఒకటి.

మరి ఈ సాంగ్ కోసం ఈ చిత్రం రిలీజ్ అయ్యిన నాటి నుంచి కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకి మేకర్స్ ఈ సాంగ్ ని ఇప్పుడు రిలీజ్ చేసేసారు. అయితే ఈ సాంగ్ ని థియేటర్స్ లో చూసి ఒక పవర్ ఫుల్ బీట్స్ వెర్షన్ ని శ్రోతలు అంతా కోరుకున్నారు కానీ మేకర్స్ కాస్త భిన్నంగా స్లో అండ్ కూల్ వెర్షన్ ని 3 నిమిషాల లోపు ఉన్న సాంగ్ ని రిలీజ్ చేసారు. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ సాంగ్ సహా సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని సంగీత దర్శకుడు గౌర హరీష్ అందించగా మేకర్స్ “జై హనుమాన్” పనుల్లో ఇప్పుడు బిజీగా ఉన్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు