“హరిహర వీరమల్లు 1” టీజర్.. ఇన్నేళ్ల నిరీక్షణకు ఊహించని ట్రీట్

“హరిహర వీరమల్లు 1” టీజర్.. ఇన్నేళ్ల నిరీక్షణకు ఊహించని ట్రీట్

Published on May 2, 2024 9:17 AM IST

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం పవర్ స్టార్ అభిమానులు ఎన్నో ఏళ్ల తరబడి ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి అభిమానులు గత కొన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న అవైటెడ్ టీజర్ కట్ ని ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేశారు.

అయితే ఈ టీజర్ మాత్రం ఊహించని లెవెల్లో ఉందని చెప్పాలి. నైజాం నవాబు కాలంలో జనం పక్షాన పోరాడే యోధుడిగా పవన్ కళ్యాణ్ తన రోల్ లో అదిరిపోయాడు అని చెప్పాలి. అంతే కాకుండా సినిమాలో విజువల్స్ ఊహించని విధంగా కనిపించడం విశేషం. చాలా నాచురల్ గా కనిపిస్తున్నాయి. నటుడు బాబీ డియోల్ పాత్ర తన మేకోవర్ కూడా ఆసక్తిగా కనిపిస్తున్నాయి.

ఇక పవన్ విషయానికి వస్తే.. ఇది వరకు వచ్చిన గ్లింప్స్, పవర్ గ్లాన్స్ లు ఈ టీజర్ ముందు చిన్నబోయాయి అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం పవన్ స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ ని ట్రై చేయగా ఇవి ఇందులో ఓ రేంజ్ లో కనిపిస్తూ పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా అనిపిస్తున్నాయి. అలాగే టీజర్ లో కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.

ఓవరాల్ గా మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా వర్కౌట్ అయ్యే దానిలా ఇన్నేళ్లు ఆలస్యం అయ్యినా కూడా ఇంత కాలం నిరీక్షణకు వర్త్ అనిపించేలా ఉందని చెప్పాలి. ఇక ఈ టీజర్ తోనే సినిమా రెండు భాగాలుగా వస్తున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేసారు. ఇక ఈ సినిమా రిలీజ్ ని కూడా 2024 అన్నట్టే పెట్టడం విశేషం.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు