మన ఇండియన్ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు భారీ విజువల్ వండర్ చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతా రాములుగా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఫాంటసీ విజువల్ వండర్ చిత్రం “రామాయణ” కూడా ఒకటి.
ఇండియన్ సినిమా నుంచి మొదటి ఐమ్యాక్స్ వెర్షన్ సినిమాగా పూర్తిగా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా ఇది. మరి ఈ అవైటెడ్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈ జూలై 18 న ఉంటుంది అని బలమైన పుకార్లు వినిపించాయి. ప్రముఖ హాలీవుడ్ సినిమా ఈవెంట్ కామిక్ కాన్ లో రామాయణ ట్రైలర్ లాంచ్ ఉందని టాక్ వచ్చింది.
అయితే ఈ పుకార్లకు మేకర్స్ ఇప్పుడు అధికారికంగా చెక్ పెట్టేసారు. రామాయణ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ప్రీమియర్ ఈ జూలై 24 నుంచి ఉంటుంది అని కన్ఫర్మ్ చేసేసారు. సో ఆ బిగ్ డే కోసం అంతా ఎదురు చూడాలి.
ఇక దీనితో ఇచ్చిన పోస్టర్ చూస్తే ఇందులో అయోధ్యలో తమ ఇంటి నుంచి రాముడు, సీత, లక్ష్మణులు వనవాసానికి బయలుదేరుతున్నట్టుగా ఇందులో కనిపిస్తుంది. మరి ఈ ఎపిక్ ని విట్నెస్ చెయ్యాలని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ రానున్న ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాల్సిందే.
