కన్ఫర్మ్ : అప్పుడే “అయలాన్” ఓటిటి రిలీజ్ కి రెడీ

కన్ఫర్మ్ : అప్పుడే “అయలాన్” ఓటిటి రిలీజ్ కి రెడీ

Published on Jan 28, 2024 8:57 AM IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా దర్శకుడు ఆర్ రవికుమార్ తెరకెక్కించిన భారీ చిత్రం “అయలాన్”. మరి సై ఫై జానర్ లో ఈ చిత్రం తెరకెక్కగా తమిళ నాట మంచి వసూళ్లు కూడా రాబట్టింది. అయితే ఈ చిత్రం తెలుగులో కూడా థియేట్రికల్ రిలీజ్ కి రావాల్సింది. కానీ అనుకోని విధంగా ఈ చిత్రం తెలుగు రిలీజ్ టోటల్ గా రద్దయ్యింది.

అయితే అప్పుడే ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై ఇప్పుడు న్యూస్ అయితే కన్ఫర్మ్ అయ్యిపోయింది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ సన్ నెక్స్ట్ వారు అతి త్వరలోనే అయలాన్ చిత్రాన్ని స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఫిబ్రవరి 9న రిలీజ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ భారీ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా కే జె ఆర్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు