‘అయోగ్య’ టీజర్ అదిరిందిగా !

Published on Feb 6, 2019 9:49 pm IST

‘టెంపర్’ సినిమా ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ చిత్రం తమిళ్ రీమేక్ లో విశాల్ మరియు రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘అయోగ్య’ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా టీజర్ ను స్టార్ డైరెక్టర్ మురుగదాస్ చేతుల మీదుగా విడుదల చేసింది చిత్రబృందం.

కాగా ట్రైలర్ లో మూవీ కాన్సెప్ట్ తో పాటు విశాల్ కూడా బాగా హైలెట్ గా నిలిచాడు. విశాల్ లోని మాస్ ఆటిట్యూడ్ తో పాటు యాక్షన్ అంశాలు కూడా బాగున్నాయి. మొత్తానికి టీజర్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటుంది.

మరి తెలుగు మరియు హిందీలో లాగే తమిళ్ లో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి. పైగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘అయోగ్య’ చిత్రబృందం పూర్తి కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను మలుస్తున్నారుట.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :