వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న టెంపర్ తమిళ రీమేక్ !

వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న టెంపర్ తమిళ రీమేక్ !

Published on Nov 9, 2018 7:41 PM IST

యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం ‘అయోగ్య ‘ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం తెలుగు సూపర్ హిట్ చిత్రం ‘టెంపర్’ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక గత కొద్దీ రోజులుగా వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈరోజు తో ఈ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. నాన్ స్టాప్ గా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మురగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ తెరకెక్కిస్తున్నారు.

రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పార్థిబన్ , కేఎస్ రవి కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. లైట్ హౌస్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రముఖ తెలుగు నిర్మాత ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు