విడుదల తేదీ : మే 15, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి తదితరులు
దర్శకుడు : ముదస్సర్ అజీజ్
నిర్మాతలు : భూషణ్ కుమార్, జూనో చోప్రా
సంగీతం : తనిష్క్ బాగ్చి
ఛాయాగ్రహణం : జిష్ణు భట్టాచర్జీ
కూర్పు : నినద్ ఖానోల్కర్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో, గ్లామరస్ హీరోయిన్లు సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, వామిక గబ్బి నటించిన ‘పతి పత్ని ఔర్ వో దో’ సినిమాపై బాలీవుడ్‌లో మంచి హైప్ క్రియేట్ అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించిందో రివ్యూలో చూద్దాం.
కథ:
ప్రయాగ్‌రాజ్ పట్టణంలో ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేసే ప్రజాపతి పాండే(ఆయుష్మాన్ ఖురానా) తన భార్య అపర్ణ (వామికా గబ్బి)తో ప్రశాంతంగా జీవిస్తాడు. అయితే, ప్రజాపతి లైఫ్‌లోకి ఒకేసారి ఇద్దరు మహిళలు (సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్) రకరకాల కారణాలతో ప్రవేశిస్తారు. వీరి రాకతో ప్రజాపతి జీవితం ఎలాంటి గందరగోళంలో పడింది? ఆ ఇద్దరి వల్ల అతను పడిన ఇబ్బందులు ఏంటి? చివరికి అతను తన సంసారాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు? అనేదే ఈ చిత్ర కథాంశం.
ప్లస్ పాయింట్స్:
మిడిల్ క్లాస్ మెన్ పాత్రలను చేయడంలో ఆయుష్మాన్ దిట్ట. తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాను భుజాన వేసుకుని నడిపించే ప్రయత్నం చేశాడు.
సారా అలీ ఖాన్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సినిమాకు గ్లామర్ అట్రాక్షన్ తోడైంది. వామికా గబ్బి తన నటనతో ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్:
ముగ్గురు హీరోయిన్లతో డ్రామా నడిపించినా, కథలో మాత్రం పస లేదు. పాత సినిమాల్లో చూసిన సన్నివేశాలే మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయి.
ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలు సినిమా నిడివిని పెంచేసి బోర్ కొట్టిస్తాయి.
దర్శకుడు ముదస్సర్ అజీజ్ కామెడీని పండించడంలో ఈసారి తడబడ్డాడు. డైలాగ్స్ లో పంచ్ పవర్ తగ్గింది. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా కనెక్ట్ అవ్వవు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు రాసుకున్న కథ చాలా ఫ్లాట్ గా ఉంది. ఎలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు లేకుండా సినిమా సాగుతుంది. తనిష్క్ బాగ్చి అందించిన సంగీతంలో రీమిక్స్ పాటలే ఎక్కువగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే సినిమా వేగం పెరిగేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
తీర్పు:
ఓవరాల్ గా చుస్తే.. ‘పతి పత్ని ఔర్ వో దో’ సినిమా ఆశించిన స్థాయిలో వినోదాన్ని పంచలేకపోయింది. ఆయుష్మాన్ ఖురానా నటన మరియు హీరోయిన్ల గ్లామర్ ప్లస్ పాయింట్స్. బలహీనమైన కథ మరియు బోరింగ్ స్క్రీన్ ప్లే సినిమా రిజల్ట్‌ను దెబ్బతీశాయి. కామెడీ ఎంటర్టైనర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా కనెక్ట్ కాకపోవచ్చు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team
