అమర్ కౌశిక్ దర్శకత్వంలో అయుష్మాన్ ఖురానా హీరోగా ‘బాలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రస్తుతం ట్రైలర్ బాగా వైరల్ అవుతుంది. హీరోకి బట్టతల ఉండటంతో, అది చూసి అందరూ నవ్వుతుంటారు. దాంతో టోపీ పెట్టుకొని హీరో తన బట్టతలను కవర్ చేస్తుంటాడు. జుట్టు పెరగడానికి మార్కెట్‌లో దొరికే అన్న ఆయుర్వేద నూనెలను వాడుతుంటాడు. అయినా జుట్టు పెరగడు. మొత్తానికి ట్రైలర్ సరదాగా సాగుతూ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమాలో అయుష్మాన్ ఖురానా సరసన యామి గౌతమ్, భూమి పెడ్నేకర్ కథానాయికలుగా నటించారు. నవంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిన అయుష్మాన్ ఖురానా వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. అలాగే ఈ సినిమాతో కూడా మరో భారీ విజయాన్ని సాధిస్తాడేమో చూడాలి.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


