ఖరారైన బాద్షా విడుదల ముహూర్తం

ఖరారైన బాద్షా విడుదల ముహూర్తం

Published on Mar 12, 2013 8:02 PM IST

Baadshah

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ సినిమా ఏప్రిల్ 5న భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాకోసం ఓ స్పెషల్ ముహూర్తాన్ని నిర్ణయించారు. నిర్మాత బండ్ల గణేష్ తెలిపిన దాని ప్రకారం హైదరాబాద్లో ఈ సినిమా మొదటి షో 5 గంటలా 23 నిమిషాలకు వేయనున్నారు.’ బ్లాక్ బస్టర్ బాద్షా ఆడియో మార్చి 17న రిలీజ్ కానుంది. అలాగే బాక్స్ ఆఫీసు వద్ద ఏప్రిల్ 5 ఉదయం 5:23 నిమిషాల నుండి ‘బాద్షా’ రూల్ చేయడం మొదలు పెడతాడని’ బండ్ల గణేష్ ట్వీట్ చేసారు.

ఈ సినిమాకి సంబందించిన రీ రికార్డింగ్ పనులు కూడా మొదలయ్యాయి, ఈ విషయంలో థమన్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు. ‘బాద్షా’ ఆడియో వేడుక మార్చి 17న హైదరాబాద్ నానక్రాం గూడా రామానాయుడు స్టుడియోలో జరగనుంది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఎన్.టి.ఆర్ కి జోడీగా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు