బండ్ల గణేష్ మనసులో ఆలోచన “బాలీవుడ్లో బాద్ షా”

Baadshah-(2)

ఎన్ .టి .ఆర్ ‘బాద్ షా’ ఏప్రిల్ 5న భారీ విడుదలకు సిద్ధం అవుతుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ ,నవదీప్ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటివలే విడుదలైన ఈ చిత్ర ఆడియోకి అద్బుతమైన స్పందన లభిస్తుంది. బండ్ల గణేశ్ ఆడియో విజయం పట్ల చాలా ఆనందంగా వున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చెయ్యనున్నారు . “నేను ‘బాద్ షా ‘ విజయం పట్ల చాల విశ్వాసంగా వున్నాను. ‘బాద్ షా’ చిత్రాన్ని నా తమ్ముడు శ్రీను వైట్ల దర్శకత్వంలో హిందీ లో రీమేక్ చేయనున్నారని” ట్వీట్ చేసాడు.

ఈ వార్త ఇంకా ఖరారు కావలసివుంది. ఇదే గనుక జరిగితే ఎన్.టి.ఆర్ పాత్రని హిందీలో ఎవరు పోషిస్తారో అన్నది ఆసక్తికరం. గతంలో ‘దూకుడు’ హిందీ వెర్షన్లో సల్మాన్ ఖాన్ నటించనున్నాడని వార్తలు వినిపించాయి. ఈ సినిమాకి కూడా శ్రీను వైట్లయే దర్శకుడు అన్నారు. అయితే ఇది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉండగా ‘బాద్ షా’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాబోవు రెండు వారాలలో మరింత జోరందుకోనుంది. థమన్ సంగీత దర్శకుడు. కె.వి గుహన్ సినిమాటోగ్రాఫర్

Exit mobile version