వాయిదా పడ్డ బాద్షా టీజర్ లాంచ్

వాయిదా పడ్డ బాద్షా టీజర్ లాంచ్

Published on Mar 10, 2013 6:40 PM IST

Baadshah

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘బాద్షా’ టీజర్ , ప్రోమో సాంగ్ లాంచ్ వాయిదా పడింది. అనుకున్న దాని ప్రకారం మార్చి 10న ఆడియో రిలీజ్ జరగాలి కానీ సెక్యూరిటీ కారణాల వల్ల వాయిదా పడడంతో ఫ్యాన్స్ ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక బాద్షా టీం టీజర్, ప్రోమో సాంగ్ ని మహా శివరాత్రి సందర్భంగా ఈ రోజు విడుదల చేయాలనుకుంది. కానీ అది కూడా జరగలేదు.

ఈ మూవీ కథా రచయితలలో ఒకరైన గోపీ మోహన్ చెబుతూ ‘ ప్రస్తుతం బాద్షా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అంతేకాక చివరిదశలో ఉంది. సినిమాకి సంబందించిన డబ్బింగ్, రీ – రికార్డింగ్, ఎడిటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్ మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి. షూటింగ్ – పోస్ట్ ప్రొడక్షన్ టైట్ షెడ్యూల్ కారణం వల్ల క్వాలిటీ లేని టీజర్ ని విడుదల చేయకూడదని బాద్షా టీం నిర్ణయించుకుంది. ప్రతి ఒక్క దగ్గరా బాద్షా పేరు స్పెషల్ గా వినిపిస్తోంది. మీకందరికీ థియేటర్లలో గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామని బాద్షా టీం ప్రామిస్ చేస్తోంది. మార్చి 17కి టీం ప్రిపేర్ అవుతోందని’ తెలిపారు.

ప్రొడక్షన్ టీంకి దగ్గరి వారు టీజర్లో ఎన్.టి.ఆర్ లుక్ టెర్రిఫిక్ గా ఉందని, అది ఈ రోజు రిలీజ్ చెయ్య కూడదని సమాచారం. శ్రీను వైట్ల చెప్పిన ఎన్.టి.ఆర్ స్టైలిష్ లుక్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ చూడాలంటే ఫ్యాన్స్ మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు. కోనా వెంకట్ – గోపీ మోహన్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు