‘బాహుబలి’ నైజాం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతో ఊహించగలరా.?

baahubali
మన కళ్ళు రెప్ప వేయకుండా చూసే భారీ సెట్స్, ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్, ఇవన్నీ చూస్తూ కూడా మనం చూస్తున్నది తెలుగు సినిమానేనా అని ఒకింత ఆశ్చర్యం, ఒకింత గర్వంగా ఫీలయ్యేలా చేసే సినిమా ‘బాహుబలి’. మాస్టర్ మైండ్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. ప్రీమియర్ షోస్ నుంచే ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది.

బాహుబలి సినిమా ఒక్క నైజాంలోనే మొదటి రోజు 6.22 కోట్ల షేర్, రెండవ రోజు 3.55 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని తెలియజేశాం. కేవలం రెండు రోజుల్లో 9.77కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యే టైంకి 18 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుందని నైజాం డిస్ట్రిబ్యూటర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ట్రేడ్ వర్గాలు కూడా కచ్చితంగా అంత అమౌంట్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుపుతోంది. బాహుబలి లైఫ్ టైంలో కూడా నైజాంలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. ఆర్కా మీడియా వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.

మేము కంటిన్యూగా అన్ని ఏరియాలకి చెందిన డిస్ట్రిబ్యూటర్స్ తో కాంటాక్ట్ లో ఉన్నాం, వారి దగ్గర నుంచి కచ్చితమైన కలెక్షన్స్ ని మీకు అందిస్తున్నాం. సో ఫ్రెండ్స్ బాహుబలి ప్రత్యేకమైన కలెక్షన్స్ డీటైల్స్ కోసం 123తెలుగు.కామ్ ని విజిట్ చేస్తూ ఉండండి.

Exit mobile version