నైజాంలో 2వారాల్లో 32 కోట్ల ‘బాహుబలి’

నైజాంలో 2వారాల్లో 32 కోట్ల ‘బాహుబలి’

Published on Jul 24, 2015 4:20 PM IST

baahubali
తెలుగు సిల్వర్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్ తో థియేటర్స్ లో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్న సినిమా ‘బాహుబలి’. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, రానాలు ముఖ్య పాత్రలు పోషించారు. నిన్నటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు పూర్తయ్యింది. కానీ ఈ థియేటర్స్ దగ్గర కలెక్షన్స్ వర్షం మాత్రం ఆగడం లేదు. కేవలం రెండు వారాల్లోనే ఇరు రాష్ట్రాల్లో కలిపి 85 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి రికార్డ్ నెలకొల్పింది. ఓవరాల్ గానే కాకుండా నైజాంలో కూడా రికార్డ్ రిపోర్ట్ వచ్చింది.

నైజాంలో కేవలం 12 రోజుల్లోనే 30 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసిన బాహుబలి, మిగిలిన రెండు రోజుల్లో కూడా ప్రతి రోజూ సుమారు కోటి రూపాయలు కలెక్ట్ చేసి ఓవరాల్ గా 2 వారాల్లో 32 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తుంది. టోటల్ రన్ లో బాహుబలి ఒక్క నైజాంలోనే 35 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి 40 కోట్ల షేర్ మార్క్ కి దగ్గరవుతుందని అంటున్నారు. మూడవ వారం వీకెండ్ లో కూడా కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ వారం కొదొఆ పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం వలన కలెక్షన్స్ పరంగా ఎలాంటి డ్రాప్స్ ఉండవని సమాచారం.

తాజా వార్తలు