12 రోజుల్లో బాహుబలి @82 కోట్లు

12 రోజుల్లో బాహుబలి @82 కోట్లు

Published on Jul 22, 2015 7:52 PM IST

baahubali
తెలుగు చలన చరిత్రలో మరచిపోలేని చిత్రంగా, తెలుగు సినిమా స్థితిని, గతిని మార్చడమే కాకుండా తెలుగువాడి సత్తాని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. ఇండియన్ ఫస్ట్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ గా వచ్చిన ‘బాహుబలి’ మొదటితో రోజు నుంచీ భారీగానే కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డ్స్ బద్దలు కొడుతోంది. బాహుబలి రిలీజ్ అయ్యి రెండవ వారం అయినా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. కేవలం 4 రోజుల్లోనే తెలుగు చలన చిత్ర సీమ ఆల్ టైం రికార్డ్స్ ని బద్దలు కొట్టి నెంబర్ 1 స్థానంలో నిలబడిన సినిమా ‘బాహుబలి’ మొదటి వారంలో ఒక్క తెలుగులోనే 100కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. అంతే కాకుండా గ్రాస్ పరంగా మొదటి 12 రోజుల్లో 375కోట్ల గ్రాస్కలెక్ట్ చేసింది.

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ఆంధ్ర – తెలంగాణలతో కలుపుకొని 75 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఏరియా పరంగా బాహుబలి షేర్ వివరాలు మీకోసం

ఏరియా
కలెక్షన్స్(షేర్)
నైజాం 30.42 కోట్లు
సీడెడ్ 17.06 కోట్లు
నెల్లూరు 3.14 కోట్లు
గుంటూరు 7.39 కోట్లు
కృష్ణా  5.19 కోట్లు
పశ్చిమ గోదావరి 5.69 కోట్లు
తూర్పు గోదావరి 6.46 కోట్లు
వైజాగ్ 6.90 కోట్లు
మొత్తం 82.25 కోట్లు

తాజా వార్తలు