
మూడేళ్ళ పాటు ఎంతో మంది కష్టపడి తీసిన ‘బాహుబలి’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తూ టాలీవుడ్ ఆల్ టైం రికార్డ్ గా నిలిచింది. తెలుగు చలన చరిత్రలో మరచిపోలేని చిత్రంగా, తెలుగు సినిమా స్థితిని, గతిని మార్చడమే కాకుండా తెలుగువాడి సత్తాని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. ఇండియన్ ఫస్ట్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ గా వచ్చిన ‘బాహుబలి’ మొదటి రోజు నుంచీ భారీగానే కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డ్స్ బద్దలు కొడుతోంది. మొదటి వారమే కాదు రెండవ వారం కూడా తన స్టామినాని చాటుకున్న సినిమా ఇది.
బాహుబలి సినిమా కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే తెలుగు చలన చిత్ర సీమ ఆల్ టైం రికార్డ్స్ ని బద్దలు కొట్టి నెంబర్ 1 స్థానంలో నిలుచుంది. ఆ తర్వాత 10 రోజుల్లో కేవలం ఇరు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ తోనే 75 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. నిన్నటితో రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి 14 రోజుల్లో ఇరు రాష్ట్రాల్లో 85 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం ఓవర్సీస్ తో కాకుండా కేవలం తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ తోనే 100 కోట్ల మార్క్ క్రాస్ చేసే తొలి తెలుగు సినిమా బాహుబలి అని అంటున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.