
తెలుగుతో పాటు ఇండియన్ సినీ అభిమానులను కనీ వినీ ఎరుగని సెట్టింగులతో, హాలీవుడ్ సినిమాని తలపించే విజువల్స్ తో థ్రిల్ చేసిన సినిమా ‘బాహుబలి’. బాహుబలి విజువల్స్ పరంగా ఆడియన్స్ ని ఏ రేంజ్ లో థ్రిల్ చేస్తోందో, అంతకు మించి కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇప్పటికే తెలుగులో ఆల్ టైం రికార్డ్ ని బ్రేక్ చేయడమే కాకుండా ఫస్ట్ వీక్ షేర్ తో 100కోట్ల క్లబ్ లో చేరనున్న మొదటి తెలుగు సినిమాగా రికార్డ్ నెలకొల్పనుంది. అలాగే అన్ని భాషల్లో కలుపుకొని ఫస్ట్ వీక్ 150 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేయనుంది. ఇక్కడ అందరినీ షాక్ చేస్తున్న విషయం మరొకటి ఉంది..
అదేమిటంటే ఫస్ట్ వీకెండ్ టైంలో పలువురు ట్రేడ్ రిపోర్టర్స్ ఫస్ట్ వీకెండ్ సూపర్బ్ గానే ఉన్నా వీక్ డేస్ లో ఈ జోష్ తగ్గుతుందని అన్నారు. కానీ అందరినీ షాక్ చేసేలా వీక్ డేస్ లో కూడా ఎవ్వరూ ఊహించని స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సాధించింది. ముఖ్యంగా తెలుగు మరియు హిందీలో 5 కోట్లకి పైనే షేర్ ని సాధించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. తెలుగులో వీక్ డేస్ లో కూడా ఇంతలా స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకున్న సినిమా బాహుబలినే కావడం చెప్పదగిన విషయం. మాస్టర్ మైండ్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.