‘బాహుబలి’ టోటల్ గ్రాస్ 355 కోట్లు.!

‘బాహుబలి’ టోటల్ గ్రాస్ 355 కోట్లు.!

Published on Jul 21, 2015 2:25 AM IST

baahubali
ఇండియన్ మోస్ట్ ప్రిస్టీజియస్ మరియు ఫస్ట్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అయిన ‘బాహుబలి’ సినిమా విడుదలైన నాటినుంచే బాక్స్ ఆఫీసు వద్ద సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇప్పటికే ఏరియా పరంగా, అన్ని భాషల పరంగా ఆల్ టైం రికార్డ్స్ సృష్టిస్తున్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ ని సృష్టించింది. అన్ని భాషలతో కలుపుకొని బాహుబలి సినిమా 10 రోజుల్లో గ్రాస్ 350 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. ఒక తెలుగు సినిమా 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చెయ్యడం ఎవర్గ్రీన్ రికార్డ్ అని చెప్పాలి. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా ఈ 300 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేయకపోవడం విశేషం.

ఇక ఓవరాల్ కలెక్షన్ విషయాల్లోకి వెళితే.. ట్రేడ్ రిపోర్ట్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం బాహుబలి సినిమా ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కలుపుకొని గ్రాస్ 55 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఇండియా వ్యాప్తంగా నాలుగు(తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ) భాషల్లో కలుపుకొని గ్రాస్ 300 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఓవరాల్ గా ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుంటే 10 రోజుల్లో 355 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. దీంతో సౌత్ ఇండియన్ నెంబర్ వన్ గ్రాసర్ గా ‘బాహుబలి’ నిలిచింది. కేవలం ఇది 10 రోజుల్లో వచ్చింది మాత్రమే టోటల్ లాంగ్ రన్ లో 450 కోట్ల గ్రాస్ మార్క్ ని ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

దర్శకధీరుదు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ లు ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్కా మీడియా వారు నిర్మించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.

తాజా వార్తలు