యాడ్ లపై ఒక్క పైసా కూడా ఖర్చుచేయకుండా…

యాడ్ లపై ఒక్క పైసా కూడా ఖర్చుచేయకుండా…

Published on Jul 21, 2015 12:19 AM IST

baahu-bali
సినిమాకి ప్రేక్షకుడికి మధ్య ప్రధాన మాధ్యమంగా ఈ మీడియా అవతరించి దశాబ్ద కాలం దాటింది. పెద్ద సినిమాల వ్యయం లో ఇంత శాతమని ప్రచారానికి పక్కన పెట్టి మరీ ప్రకటనల రూపంలో విడుదలకు ముందు దుమ్మురేపడం సర్వ సాధారణం. అయితే బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ గా తెరకెక్కిన బాహుబలి మాత్రం ప్రింట్ మీడియా, ఈ మీడియాలకోసం ఒక్క పైసా ఖర్చుపెట్టకపోవడం విశేషం.

విడుదలైన పది రోజులలోనే 300కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ చిత్రం పక్కా ప్రణాళికతో విడుదలైంది. యావత్ భారతదేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది అని ఊహించిన మీడియా ఎవరూ ఊహించని విధంగా కధనాలు ప్రచురించారు. కొన్ని ప్రముఖ వార్తా పత్రికలు విడుదలకు వారం రోజుల ముందు నుండీ సగానికి పైగా సినిమా పేజ్ కాలమ్స్ బాహుబలికి అర్పించడంతో జక్కన్నకి పబ్లిసిటీ అవసరం పడలేదు. ఏదైతేనే ప్రకటనల వ్యయంలేకుండా ఇన్ని కోట్లు సాధించిన సినిమాగా మరో రికార్డుని సొంతంచేసుకుంది.

తాజా వార్తలు