నైజాంలో 30 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ‘బాహుబలి’

నైజాంలో 30 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ‘బాహుబలి’

Published on Jul 22, 2015 3:58 PM IST

baahubali11
తెలుగు సిల్వర్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్ తో థియేటర్స్ లో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్న సినిమా ‘బాహుబలి’. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, రానాలు ముఖ్య పాత్రలు పోషించారు. విడుదలైన రెండవ వారంలో కూడా బాహుబలి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. అన్ని ఏరియల్లోనూ ఇప్పటికే సూపర్బ్ కలెక్షన్స్ సాధించిన బాహుబలి ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకుపోతోంది.

నైజాంలో బాహుబలి సినిమా సెకండ్ వీక్ లో కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి 12 రోజుల్లో బాహుబలి సినిమా ఒక్క నైజాంలోనే 30 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి ఎవర్గ్రీన్ రికార్డ్ గా నిలిచింది. ఆ వివరాలు మీకోసం..

వారం కలెక్షన్స్(షేర్)
మొదటి వారం 22.58 కోట్లు
శుక్రవారం 1.54 కోట్లు
శనివారం  2.08 కోట్లు
ఆదివారం  2.12 కోట్లు
సోమవారం  1.20 కోట్లు
మగళవారం  0.90 కోట్లు
మొత్తం  30.42 కోట్లు

తాజా వార్తలు