ఓటిటి సమీక్ష: “బాహుబలి” – క్రౌన్ ఆఫ్ బ్లడ్ – తెలుగు డబ్ సిరీస్ హాట్ స్టార్ లో

ఓటిటి సమీక్ష: “బాహుబలి” – క్రౌన్ ఆఫ్ బ్లడ్ – తెలుగు డబ్ సిరీస్ హాట్ స్టార్ లో

Published on May 18, 2024 3:04 AM IST
Baahubali: Crown of Blood - Telugu dubbed series Review

విడుదల తేదీ : మే 17, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకులు : జీవన్ జె కాంగ్, నవీన్ జాన్

నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ ఎస్ రాజమౌళి, జీవన్ జే. కాంగ్, శరద్ దేవరాజన్, షేక్ మక్బూల్

సంగీత దర్శకుడు: కాలభైరవ

ఎడిటింగ్: తరుణ్ ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఇండియన్ సినిమాని షేక్ చేసిన సెన్సేషనల్ సినిమా “బాహుబలి” చిత్రాల కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఈ చిత్రానికి యానిమేటెడ్ వెర్షన్ లో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి అండ్ కో గ్లోబల్ గా బాహుబలి కి మరింత రీచ్ రావాలనే ప్రయత్నంలో అనౌన్స్ చేసిన తాజా వెబ్ సిరీస్ నే “బాహుబలి” – క్రౌన్ ఆఫ్ బ్లడ్. మరి రీసెంట్ గా మంచి బజ్ ని అందుకున్న ఈ సిరీస్ తాజాగా డిస్నీ + హాట్ స్టార్ లో పలు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ:

ఇక కథ లోకి వస్తే.. ఈ సిరీస్ లో ప్రధాన అంశం బాహుబలిని హతమార్చడానికి మునుపు కనిపిస్తుంది. మాహిష్మతి సామ్రాజ్యం చుట్టు పక్కల రాజ్యాలను కూలగొడుతూ రక్తదేవ్ అనే మహా క్రూరుడు, బలవంతుడు మాహిష్మతిని కూడా ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తాడు. మరి క్రమంలో అతడిని బాహుబలి, భల్లాలదేవ ఇద్దరూ కలిసి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ మాహిష్మతికి విధేయుడు అయినటువంటి కట్టప్ప రక్తదేవ్ కోసం పని చేస్తాడు. ఇది ఒక ఊహించని అంశం కాగా ఈ ఆసక్తికర ప్రశ్నకి, అసలు ఈ రక్తదేవ్ ఎవరు? తన పాత్ర ఏంటి? బాహుబలి, భల్లాలదేవ తమ రాజ్యాన్ని అతడి నుంచి కాపాడుకుంటారా లేదా అనే ఆసక్తికర ప్రశ్నలకి సమాధానాలు కావాలి అంటే ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి.

 

ప్లస్ పాయింట్స్:

బాహుబలి బిగ్ స్క్రీన్స్ వెర్షన్ లో భారీ ట్విస్ట్ కట్టప్ప విషయంలో ఎంత ఎగ్జైట్ చేస్తుందో ఇదే కోవలో ఈ సిరీస్ లో కూడా కట్టప్పపై కనిపించే ఆసక్తికర అంశం ఉత్కంఠగా అనిపిస్తుంది. అలాగే తనతో పాటుగా ఒక నూతన పాత్ర రక్తదేవ్ ని రాసుకున్న విధానం అతడిని ప్రెజెంట్ చేసిన విధానం కూడా మెప్పిస్తుంది. తనలోని క్రూరత్వంలో జక్కన్న కాంపౌండ్ విలన్ మార్క్ విజన్ కనిపిస్తుంది.

అలాగే బాహుబలి రక్తదేవ్ ల నడుమ కొన్ని సన్నివేశాలు ఆసక్తి కలిగిస్తాయి. ఇక వీటితో పాటుగా చివరి నాలుగు ఎపిసోడ్స్ మంచి ఎంగేజింగ్ గా కొనసాగుతాయి. అంతే కాకుండా మరో ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ కూడా ఈ సిరీస్ లో ఉంది. అలాగే రాజమౌళి సినిమాల్లో ఆయుధాలు అంటేనే ఒక డిఫరెంట్ బ్రాండ్ ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఈ కోణం కూడా ఈ సిరీస్ లో డిఫరెంట్ ఆయుధాలతో కనిపిస్తుంది. అలాగే పలు యుద్ధ సన్నివేశాలు, కొన్ని చోట్ల డ్రామా బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్:

బాహుబలి అనే సినిమా ఇండియన్ సినిమా గతినే మార్చింది అని అందరికీ తెలుసు. అలాగే ముఖ్యంగా మన తెలుగు సినిమాగా మనకి కూడా ఇది ఎంతో ప్రత్యేకం. కానీ ఈ సిరీస్ తో మాత్రం మన తెలుగు ఆడియెన్స్ పూర్తిగా సంతృప్తి చెందకపోవచ్చు. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి.

మెయిన్ గా ఇది యానిమేటెడ్ సిరీస్ అయినప్పటికీ మన తెలుగు వెర్షన్ డబ్బింగ్ ఏమాత్రం ఆకట్టుకోదు. దీనితో తెలుగు వెర్షన్ లో ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూసే వారికి నిరాశ తప్పదు. అలాగే ఇంట్రెస్టింగ్ గా హిందీ వెర్షన్ కి ఒరిజినల్ డబ్బింగ్ ని చెప్పించి తెలుగు వెర్షన్ కి స్కిప్ చెయ్యడం తెలుగు వెర్షన్ పై చిన్న చూపులా అనిపిస్తుంది.

అలాగే అసలు బాహుబలి అనే పాత్రకి ప్రభాస్ తప్ప మరెవరినీ ఊహించుకోడానికి లేదు అనే రేంజ్ లో ముద్ర పడింది. కానీ ఇది సిరీస్ లో లోపిస్తుంది. ప్రభాస్ యానిమేటెడ్ వెర్షన్ ప్రభాస్ లుక్స్ లో కనిపించదు. తన మాట, నడవడిక కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ని మెప్పించలేకపోవచ్చు.

ఇంకా కట్టప్ప విషయంలో మరోసారి ఎందుకు? అనే అంశం ఆసక్తి రేపుతుంది కానీ దానికి ఇచ్చిన ముగింపు అర్థరహితంగా ఉంటుంది అని చెప్పాలి. అలాగే బాహుబలి లో కదిలించే ఎమోషన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా హైలైట్స్ ఉంటాయి కానీ ఊహించని విధంగా ఇవి బాగా మిస్ అయ్యాయి. ఇంకా మొదటి రెండు ఎపిసోడ్స్ అయితే పెద్దగా ఆసక్తిని కలిగించవు.

 

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు పర్వాలేదు. పైన చెప్పినట్టుగా నేపథ్య సంగీతం అయితే మరీ కీరవాణి రేంజ్ లో అనిపించలేదు. ఈ సిరీస్ కి తన తనయుడు కాల భైరవ సంగీతం అందించాడు. అలాగే ఎడిటింగ్ బాగానే ఉంది. అలాగే బాహుబలి పాత్ర మినహా మిగతా పాత్రల తాలూకా యానిమేషన్ బాగుంది.

ఇక దర్శకులు జీవన్ జె కాంగ్ అలాగే నవీన్ జాన్ విషయానికి వస్తే తాము ఈ సిరీస్ కి పర్వాలేదనిపిస్తారు. మెయిన్ గా మంచి ఎమోషన్స్ ని కూడా జెనరేట్ చేసి ఉంటే మరింత బాగా వర్కౌట్ అయ్యేది. ఈ విషయంలో రచన బృందంతో ఎక్కువసేపు కూర్చోవాల్సింది.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ భారతీయ సినిమా గ్రేటెస్ట్ బ్లాక్ బస్టర్ “బాహుబలి” కి యానిమేటెడ్ వెర్షన్ లో కొత్త కోణంతో వచ్చిన ఈ సిరీస్ “బాహుబలి” – క్రౌన్ ఆఫ్ బ్లడ్ పూర్తి అంచనాలు అందుకోలేదు అని చెప్పాలి. యానిమేషన్, యుద్ధ సన్నివేశాలు, కొన్ని పాత్రలు, ట్విస్ట్ లు బాగానే ఉన్నాయి కానీ సరైన ఎమోషన్స్ లేవు అలాగే బాహుబలి పాత్ర తాలూకా యానిమేషన్ వెర్షన్ ప్రభాస్ అభిమానులని డిజప్పాయింట్ చేయవచ్చు. ఇంకా తెలుగు డబ్బింగ్ బాగాలేదు, మొదటి రెండు ఎపిసోడ్స్ కూడా డల్ గా అనిపిస్తాయి. ఇక వీటితో అయితే ఈ వారాంతానికి ఓటిటిలో బాహుబలి హార్డ్ కోర్ అభిమానులు ఓసారి ట్రై చేయవచ్చు. అలాగే పిల్లలకి కాస్త నచ్చవచ్చు. ఓవరాల్ గా తక్కువ అంచనాలు పెట్టుకొని ఈ సిరీస్ చూస్తే మంచిది.

గమనిక: మాకు ఈ సిరీస్ అన్ని ఎపిసోడ్స్ వీక్షించే అవకాశం వచ్చింది. వాటి అనుగుణంగానే రేటింగ్, సమీక్ష అందించాము.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు