ఇప్పుడు భారతీయ సినిమా ఎంతో సగర్వంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రాల్లో ఒకటి “రామాయణ”. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతుంది.
అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఇంగ్లీష్ తో పాటుగా పాన్ ఇండియా భాషల్లో కూడా మేకర్స్ ఈ సినిమాని విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇండియా వైడ్ డిస్ట్రిబ్యూట్ చేసేందుకు “బాహుబలి” డిస్ట్రిబ్యూటర్ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది.
హిందీ సినిమా దగ్గర బాహుబలి సినిమాని భారీ ఎత్తున విడుదల చేసిన కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ తో రామాయణ చిత్రాన్ని ఈ దీపావళికి భారతదేశం అంతటా విడుదల చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. సో ఈ సినిమాకి బిగ్ బూస్టప్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ లు సంగీతం అందిస్తుండగా నమిత్ మల్హోత్రా నిర్మాణం వహిస్తున్నారు.


