ఢిల్లీకి చేరిన ‘బాహుబలి’ ఫైనల్ ప్రమోషన్స్

Baahubali-still
బాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు, సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. ఈ చిత్ర టీం గత నెల రోజులుగా హిందీ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో భారీ ఎత్తున ప్రమోట్ చేసారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. దాంతో ఈ చిత్ర టీం ప్రమోషన్స్ ని చివరి దశకు తీసుకువచ్చాయి. ఫైనల్ టచ్ కోసం బాహుబలి టీం సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ ఇండియా రాజధాని ఢిల్లీ. ఇప్పటికే ప్రభాస్, రానా, తమన్నా, రాజమౌళిలు కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు వీరు అక్కడ నేషనల్ మీడియాలో బాహుబలిని భారీ ఎత్తున ప్రమోట్ చేయనున్నారు.

ఈ ఢిల్లీ టూర్ తో ఈ చిత్ర టీం ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ ని పూర్తి చేయనున్నారు. నిన్నటి సాయంత్రానికి ఫైనల్ వెర్షన్ రెడీ అవ్వడంతో ప్రింట్ ని అన్ని ఎరియాలకి డిస్పాచ్ చేసే పనిలో ఉన్నారు. జూలై 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ప్రసతుతం సినీ అభిమానుల్లో ఈ సినిమా బెనిఫిట్ షో కోసం భారీ క్రేజ్ నెలకొంది. ప్రతి బెనిఫిట్ షోకి సంబందించిన టికెట్స్ భారీ రేటుకు అమ్ముడు పోతున్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలతో పాటు రమ్యకృష్ణ, సత్య రాజ్, సుధీప్, నాజర్, అడవి శేష్ లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.

Exit mobile version