గోల్కొండ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘బాహుబలి’

గోల్కొండ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘బాహుబలి’

Published on Jun 10, 2014 11:50 AM IST

prabhas-in-bahubali
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ హంక్ రానా ప్రధాన పాత్రల్లో సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘బాహుబలి’. సమ్మర్ వేడికి కాస్త విరామం తీసుకున్న ఈ చిత్ర టీం ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు. మొదటి రోజు గతంలో ఆగిపోయిన కొన్ని సీన్స్ ని రీ షూట్ చేసారు.

ఆ తర్వాత మూడు రోజుల షూట్ కోసం ఈ చిత్ర టీం గోల్కొండ ఫోర్ట్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ‘ఈగ’ స్టార్ సుధీప్, తమిళ స్టార్ సత్యరాజ్ పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. నిన్నటితో మూడు రోజుల గోల్కొండ షెడ్యూల్ పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.

అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, నాజర్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. 2015 లో ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు