యూఎస్‌లో 1 మిలియన్ కొట్టిన ‘భలే భలే మగాడివోయ్’

Bhale-Bhale-Magadivoy
దర్శకుడు మారుతి, తనదైన కామెడీ టైమింగ్‌తో కట్టిపడేసే యంగ్‌హీరో నానిల కాంబినేషన్‌లో రూపొందిన ‘భలే భలే మగాడివోయ్’ అన్ని చోట్లా సూపర్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ అవుడ్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ విడుదలైన రోజునుంచే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఇక నిన్న సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి ప్రవేశించిన ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యపరచే కలెక్షన్స్ సాధిస్తోంది.

మొదటివారం ముగిసేసరికి ఈ సినిమా అమెరికాలో 1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఒక మిడిల్ లెవల్ బడ్జెట్‌లో రూపొందిన సినిమా ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం విశేషమనే చెప్పాలి. ఇప్పటివరకూ టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోలకు మాత్రమే సాధ్యమవుతూ వచ్చిన 1 మిలియన్ మార్క్‌ను నాని సినిమా సొంతం చేసుకోవడంతో అతడి స్టార్‌డమ్ పెరిగిందనే చెప్పాలి. నాని బ్రాండ్ కామెడీ, మారుతి మార్క్ టేకింగ్, మతిమరుపు ప్రేమికుడి పాట్లు ప్రేక్షకులను బాగా నవ్విస్తున్నాయి. నాని సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. గోపీసుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు బాగా కలిసివచ్చింది.

Exit mobile version