
గత మూడు రోజులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు జక్కన్న రాజమౌళి అభిమానులతో పాటు సినీ ప్రేమికులు రేపు రిలీజ్ కానున్న ‘బాహుబలి’ టికెట్స్ కోసం థియేటర్స్ ముందు బారులు తీరారు. టికెట్స్ సరైన టైం కి ఇవ్వని చోట థియేటర్స్ ని కూడా పగల కొట్టారు. ఇది పక్కన పెడితే మునుపెన్నడూ లేనంతగా ఇరు రాష్ట్రాల్లో ఈ సినిమా బెనిఫిట్ షోస్ పడుతున్నాయి. మా దగ్గ ఉన్న సమాచారం ప్రకారం ఇరు రాష్ట్రాల్లో కలిపి 150 బెనిఫిట్ షౌస్ పడుతున్నాయి. ఈ రేంజ్ లో బెనిఫిట్ షోస్ వేయడం ఇదే ప్రధమం అని చెప్పచ్చు.
ఇకపోతే హైదరబాద్ లో కూడా బాహుబలి బెనిఫిట్ షోస్ రికార్డ్ సృష్టించానున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే మొత్తంగా 37 బెనిఫిట్ షోస్ పడనున్నాయి. ఇన్ని షోస్ పాడడం ఇదే మొదటిసారి. అలాగే హైదరాబాద్ తర్వాత ప్రభాస్ కి ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్ గా ఉన్న పశ్చిమ గోదావరిలోనే ఎక్కువ బెనిఫిట్ షోస్ పడనున్నాయి. వెస్ట్ గోదావరిలో సుమారు 20షోస్ దాకా వేస్తున్నట్లు సమాచారం. ఓవరాల్ గా బెనిఫిట్ షోస్ తోనే రికార్డ్ కలెక్షన్స్ నమోదవుతాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
భారీ బడ్జెట్ ఫిల్మ్, రాజులు – కోతలు – యుద్దాలు – సాహస విన్యాసాలు వీటికి తోడు రాజమౌళి – ప్రభాస్ బ్రాండ్ జతకలవడంతో ఈ సినిమాకి అత్యంత భారీగా క్రేజ్ ఏర్పడింది. రానా , తమన్నా, అనుష్క, రమ్య కృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందించారు.