బాహుబలి 2వ వారం : వీక్ డేస్ లో సూపర్బ్ కలెక్షన్స్

బాహుబలి 2వ వారం : వీక్ డేస్ లో సూపర్బ్ కలెక్షన్స్

Published on Jul 21, 2015 9:20 PM IST

baahubali
గత రెండు వారాలుగా ఇండియా మొత్తం ట్రెండ్ అవుతున్న సినిమా ‘బాహుబలి’. జూలై 10న రిలీజ్ అయ్యి ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా మొదటి వారం అదిరిపోయే కలెక్షన్స్ సాధించిన సినిమా ‘బాహుబలి’. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శివుడు, బాహుబలి అనే రెండు పాత్రల్లో కనిపించి మెప్పిస్తే, రానా దగ్గుబాటి భళ్లాలదేవగా నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించాడు.

మొదటి వారంలోనే కాకుండా సెకండ్ వీక్ లో కూడా ఈ సినిమా సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. కేవలం సెకండ్ వీకెండ్ లోనే కాకుండా వీక్ డేస్ లో కూడా అదే జారుని కొనసాగిస్తూ కలెక్షన్స్ అదరగొడుతోంది. మొదటి వారంలో 22.58 కోట్ల షేర్ సాధించిన బాహుబలి సెకండ్ వీక్ లో మొదటి నాలుగు రోజుల్లో సాధించిన షేర్ విశేషాలు మీకోసం..

వారం  కలెక్షన్స్(షేర్)
మొదటి వారం 22.58 కోట్లు
శుక్రవారం 1.54 కోట్లు
శనివారం 2.08 కోట్లు
ఆదివారం  2.12 కోట్లు
సోమవారం 1.20 కోట్లు
మొత్తం
29.52 కోట్లు

తాజా వార్తలు