మే నెలలో ‘బాహుబలి’ విడుదల..!

Baahubali
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘బాహుబలి’. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ‘బాహుబలి’ విడుదల వాయిదా పడింది. మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు.

ప్రభాస్, అనుష్క, తమన్నా నటినటులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ప్రభాస్, తమన్నాలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.

ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారి బడ్జెట్ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. డబ్బింగ్, రీ రికార్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి గ్రాఫిక్ వర్క్స్ విభాగంలో పని చేస్తున్నారు.

Exit mobile version