వైజాగ్, గుంటూరులలో భారీ రేటు పలికిన బాహుబలి

Baahubali-pposter
ఒక డైరెక్టర్ ఒక సినిమా హిట్ ఇస్తేనే ఆ తర్వాత వచ్చే సినిమాపై అంచనాలు ఉంటాయి అలాంటిది వరుసగా ట్రిపుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన గ్రాఫికల్ మానియా ఫిల్మ్ ‘బాహుబలి’. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించాడు. మరో రెండు రోజుల్లో అనగా జూలై 10న రిలీజ్ కానున్న ఈ సినిమాకి అన్ని ఏరియాల్లో, అన్ని భాషల్లో భారీ క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం అన్ని ఏరియాల్లో ఈ చిత్ర టికెట్స్ కోసం సినీ అభిమానులు ఎగబడుతున్నారు.

టికెట్ల కోసమే కాదు ఈ సినిమా బిజినెస్ కి కూడా భారీ రేంజ్ క్రేజ్ ఉంది. అసలు విషయం ఏమిటంటే వైజాగ్ మరియు గుంటూరు ఎరియాలని కలుపుకొని డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం డిస్ట్రిబ్యూటర్స్ సుమారు 14 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం అడ్వాన్స్ గానే ఇంత అమౌంట్ ఇచ్చారు అంటే ఒరిజినల్ కాస్ట్ ఇంకా ఎక్కువ పలకచ్చు.
డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ సినిమాపై ఎక్కువ నమ్మకం ఉండడంతో అంత డబ్బు పెట్టి కొంటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ లెక్కల ప్రకారమే అభిమానులు కూడా ఎక్కువ డబ్బు పెట్టి అయినా సినిమా చూడడానికి సిద్దమవుతున్నారు.

ప్రభాస్ – రానా అన్నదమ్ములుగానే కాకుండా హీరో – విలన్ గా కూడా కనిపించనున్న ఈ సినిమాలో తమన్నా, అనుష్క హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు.

Exit mobile version