బల్గేరియా వెళ్ళిన ‘బాహుబలి’ టీం

బల్గేరియా వెళ్ళిన ‘బాహుబలి’ టీం

Published on Dec 1, 2014 11:54 PM IST

baahubali
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటినటులుగా దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా యూనిట్ అందరూ నవంబర్ 30న బల్గేరియా పయనమయ్యారు. నెల రోజుల పాటు బల్గేరియాలోని అందమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బల్గేరియా వెళ్తున్నట్టు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తన అఫీషియల్ పేస్ బుక్ పేజిలో పేర్కొన్నారు.

ఈ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను త్వరగా కంప్లీట్ చేయనున్నారు. సంగీత దర్శకులు యం.యం.కీరవాణి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ పార్ట్ 1ను ఏప్రిల్ 17, 2015న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పలు భాషలలో డబ్బింగ్ చేయనున్నారు.

 

తాజా వార్తలు