విరామం తీసుకున్న ‘బాహుబలి’ టీం

Bahubali
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న’బాహుబలి’ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రం కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందువల్ల ఈ చిత్రంపై ఎన్నో వదంతులు రావడం షరా మామూలు అయిపొయింది. ప్రస్తుతం ప్రభాస్ కి గాయలవ్వడం వల్ల షూటింగ్ ఆగిపోయిందనే వదంతులు వస్తున్నాయి.

ఈ వదంతులని ‘బాహుబలి’ టీం ఖండించింది. ప్రభాస్ భుజానికి ముందే అనుకునట్టు ఒక సర్జరీ జరిగింది అందువల్ల అయన విశ్రాంతి తీసుకుంటున్నారు . చిత్ర యూనిట్ షూటింగ్ నుంచి విరామం తీసుకున్న చిత్రానికి సంభందించిన ఇతర విషయాలపై శ్రద్ధ చూపిస్తున్నారు.

ప్రస్తుతం కీరవాణి ‘బాహుబలి’ చిత్రంలోని రెండు పాటలకు సంగీతం సమకుర్చారు. ఇప్పుడు స్టూడియోలో రికార్డింగ్ చేస్తున్నారు. రాజమౌళి ప్రస్తుతం ఎడిటర్ కోటగిరితో కలసి ఇప్పటి వరకు పూర్తయిన సినిమా ఎడిటింగ్ పనిలో వున్నారు. యూనిట్ మొత్తం ఈ చిత్రాన్ని అనుకున్నసమయానికి పూర్తి చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.

అర్కా మీడియా నిర్మిస్తున్నఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. రాణా దగ్గుబాటి విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

Exit mobile version