అమెరికాలోనూ భారీ ఎత్తున ‘బాహుబలి’ రిలీజ్!

అమెరికాలోనూ భారీ ఎత్తున ‘బాహుబలి’ రిలీజ్!

Published on Jul 2, 2015 12:08 PM IST

baahubali1
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ విడుదలకు దగ్గరవుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా అభిమానులు ‘బాహుబలి’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఫస్ట్ కాపీకి సిద్ధమవుతున్న ఈ సినిమా మరో ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

అమెరికాలో ‘బాహుబలి’ సినిమా ఒక్క తెలుగు భాషలోనే సుమారు 130కి పైగా స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఇక హిందీ, తమిళ, మళయాల భాషలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరగనుంది. దేశ వ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులు ఉండడం, ఇప్పటికే ట్రైలర్, పోస్టర్స్ ద్వారా సినిమాపై అంచనాలు ఆకాశానికి చేరడం.. ఇదంతా చూస్తుంటే బాహుబలి రికార్డులను తిరగరాయడానికి వస్తున్నట్టు స్పష్టమవుతూనే ఉంది.

ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండనుందనేది రాజమౌళి మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ఇప్పటికే అన్ని చోట్లా ప్రచారం మొదలుపెట్టేయగా, రాజమౌళి గత రెండు రోజుల నుంచి నేరుగా తానే ప్రచారంలోకి దిగారు.

తాజా వార్తలు