
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన భాషల్లో భారీ ఎత్తున విడుదలైన సంచలన విజయాలని నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ స్థాయి అంచనాల మధ్య వేరే ఏ ఇతర సినిమా విడుదల కాని నేపథ్యంలో ‘బాహుబలి’ సినిమా మొదటి వారం ఈ సినిమా కలెక్షన్లను కుమ్మేసింది.
రాజమౌళి విజన్, ఇండియాన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ చూడనటువంటి విజువల్స్, గ్రాఫిక్స్, ఆర్ట్ వర్క్ వెలసి బాహుబలిని విజువల్ వండర్‌గా నిలబెట్టాయ్! తెలుగు, తమిళ, మళయాలం, హిందీ ఇలా విడుదలైన అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా రెండో వారం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగులో ఇతర సినిమాలేవీ లేకపోవడంతో బాహుబలికి తిరుగే లేకుండా పోయింది. తమిళంలో మాత్రం ధనుష్ హీరోగా రూపొందిన మారీ నేడు విడుదలైంది.
భారీ అంచనాల మధ్యన విడుదలైన ఈ సినిమాతో పాటుగా బాహుబలి కూడా తమిళనాట స్టడీగా నిలబడడం విశేషంగా కనిపిస్తోంది. సుమారు 400 థియేటర్లలో విడుదలైన బాహుబలి, రెండోవారం దాదాపుగా 320 థియేటర్లలో నడవనుంది. ఇక ఇప్పటికే ఈ వీకెండ్‌కి బుకింగ్స్ కూడా స్టడీగా ఉన్నాయి. దీంతో బాహుబలి రెండో వారం కూడా స్టడీగా నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను తమిళనాట విడుదల చేసిన విషయం తెలిసిందే!