‘బాహుబలి’కి సీడెడ్లో ఇంకో 10 కోట్లు వస్తుందట.!

‘బాహుబలి’కి సీడెడ్లో ఇంకో 10 కోట్లు వస్తుందట.!

Published on Jul 21, 2015 7:41 PM IST

baahu-bali
సౌత్ ఇండియన్ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన గ్రాఫికల్ విజువల్ వండర్ ‘బాహుబలి’. మొదటి రోజు నుంచే ప్రతి ఏరియాలోనూ రికార్డ్ నెంబర్స్ కలెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి రాజమౌళి డైరెక్టర్. రాజమౌళి మరియు ఆయన క్రియేట్ చేసిన ప్రభాస్ – రానా – అనుష్క – తమన్నాల క్రేజీ కాంబినేషన్ వలన ఈ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి 10 రోజుల్లో ఒక్క సీడెడ్ లోనే 15 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. కానీ అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ మరియు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్న సమాచారం ప్రకారం ఓవరాల్ లాంగ్ రన్ లో ఇంకో 10 కోట్లకి పైనే కలెక్ట్ చేసి ఈజీగా 25 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేయనుందని అంటున్నారు.

సీడెడ్ లో ఈ రేంజ్ కలెక్ట్ చేయనుండడం ఓ అరుదైన రికార్డ్ అని చెబుతున్నారు. ఒక్క సీడెడ్ లోనే కాకుండా ఆంధ్ర, నైజాం ఏరియాల్లో కూడా ఇదే స్థాయిలో ఎన్నడూ ఊహించని సరికొత్త రికార్డ్స్ ని సృష్టిస్తోంది. ఇకపోతే మొదటి 11 రోజుల్లో ఇరు రాష్ట్రాల్లో 80 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసిందని సమాచారం. దానికి సంబందించిన పూర్తి వివరాలు మాకు అందగానే మీకు తెలియజేస్తాం. మొదటి పార్ట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ సెకండ్ పార్ట్ పై మరింత ఎక్కువగా అంచనాలు పెంచేసుకుంటున్నారు. సెప్టెంబర్ నుంచి సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

తాజా వార్తలు