
సౌత్ ఇండియన్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి’. సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెండు పార్ట్స్ గా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
దాంతో అప్పుడే ఈ సినిమాకి సంబందించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కి డిమాండ్ పెరిగిపోయింది. బాగా పోటా పోటీగా జరిగిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కాంపిటీషన్ లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కర్నాటక మరియు సీడెడ్ రైట్స్ ని రికార్డ్ ప్రైజ్ కి కొనుక్కుంది. కర్నాటక రైట్స్ ని 9 కోట్లకి కొనుక్కుంటే, సీడెడ్ రైట్స్ ని 13 కోట్లకి కొనుగోలు చేసింది.
భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తుందని డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుక్కున్న ప్రొడక్షన్ హౌస్ బావిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు.

