బాహుబలి స్పెషల్ షో చూస్తున్న పొలిటీషియన్స్

Baahubali-pposter
‘బాహుబలి’ సినిమా కోసం ఒక్క తెలుగు ప్రేక్సహ్కులు మాత్రమే లోకల్ అండ్ సెంట్రల్ పొలిటీషియన్స్ మరియు ఎంతోమంది విఐపిలు ఎదురు చూస్తున్నారని బాహుబలి ఆడియో లాంచ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తెలియజేశాడు. ఆ సమయం రానే వచ్చింది.. ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న . గ్రాఫిక్స్ తో ఓ కొత్త ప్రపంచాన్ని మనకు పరిచయం చేసి, మునుపెన్నడూ చూడని యాక్షన్ ఎపిసోడ్స్ తో అందరినీ థ్రిల్ చేస్తున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. అనుకున్నట్టుగా కొంతమంది రాజకీయ ప్రముఖులు కోసం ఈ సినిమా స్పెషల్ షో వేస్తున్నారు.

ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో 7:40 గంటలకు వేయనున్న ఓ స్పెషల్ షో కి రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణ హోం మినిస్టర్, చీఫ్ సెక్రటరీలు, ఐఎఎస్ ఆఫీసర్స్, అలాగే చాలా మంది ప్రముఖులు ఈ సినిమాకి హాజరు కానున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా చూడటం కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. అందుకే అన్ని ప్రాంతాల్లో మొదటి మూడు రోజులకి సంబందించిన టికెట్స్ అన్నీ అమ్ముడు పోయాయి.

రాజమౌళి, ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ఇలా అందరి క్రేజ్ సినిమాని తారా స్థాయికి తీసుకెళ్ళింది. ఆ స్థాయికి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.

Exit mobile version