ఆకట్టుకుంటున్న తమన్నా “బాక్” ట్రైలర్!

ఆకట్టుకుంటున్న తమన్నా “బాక్” ట్రైలర్!

Published on Apr 28, 2024 8:40 PM IST

అరణ్మనై 4 (తమిళం) చిత్రం తెలుగు లో బాక్ అనే టైటిల్ తో మే 3, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ లో తమన్నా భాటియా, రాశి ఖన్నా, సుందర్ సి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం కూడా వహించాడు. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సినిమా మొత్తం రన్‌టైమ్ దాదాపు 148 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ట్రైలర్ లో హార్రర్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. తమన్నా భాటియా, రాశి ఖన్నా పాత్రలు అలరించాయి. వెన్నెల కిషోర్, సునీల్, యోగి బాబు, శ్రీనివాస రెడ్డి, కెఎస్ రవి కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సుందర్ భార్య ఖుష్భు సుందర్ మరియు ACS అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు