ఉగాదికి స్పెషల్ గా బాలయ్య సినిమా ?

ఉగాదికి స్పెషల్ గా బాలయ్య సినిమా ?

Published on Jan 17, 2021 10:04 PM IST

నందమూరి నట సింహం బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఉగాది స్పెషల్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ ఫై ఇప్పటికే అనేక రకాలుగా చాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే ‘‘మోనార్క్‌” అనే పవర్ ఫుల్ టైటిల్ ను బాలయ్య సినిమాకి పెట్టబోతున్నారని బాగా వినిపిస్తోంది.

ఇక ఈ సినిమా ఫుల్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ గానూ ఉంటుందని ఇప్పటికే బోయపాటి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు