వాలెంటైన్స్ డే సందర్భంగా బేబీ హిందీ రీమేక్ ప్రకటన!

వాలెంటైన్స్ డే సందర్భంగా బేబీ హిందీ రీమేక్ ప్రకటన!

Published on Feb 5, 2024 12:23 AM IST

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ నటించిన రొమాంటిక్ డ్రామా బేబీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. SKN ఈ మెగా బ్లాక్‌బస్టర్‌ని నిర్మించారు. ఇప్పటికే బేబీని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. బేబీ హిందీ రీమేక్ గురించిన అప్డేట్ వాలెంటైన్స్ డే రోజున వస్తుందని ఒక కార్యక్రమంలో ఎస్‌కెఎన్ తెలిపారు.

హిందీ వెర్షన్‌కి సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను ఫిబ్రవరి 14న వెల్లడించనున్నారు. బేబీని తమిళంలో కూడా రీమేక్ చేయనున్నట్లు ఎస్‌కెఎన్ తెలిపారు. హిందీ రీమేక్‌కు సాయి రాజేష్ స్వయంగా మెగాఫోన్ పట్టనున్నారా? లేక మరోక బాలీవుడ్ దర్శకుడు రీమేక్‌ని చేపడతారా? తెలియాలంటే వేచి చూడాలి. తెలుగు వెర్షన్‌లో నాగ బాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, మరియు కీర్తనలు కూడా కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు