నవంబర్ మొదటి వారంలో బ్యాచిలర్ పార్టీ విడుదల

నవంబర్ మొదటి వారంలో బ్యాచిలర్ పార్టీ విడుదల

Published on Sep 3, 2019 7:00 AM IST

అనన్య ప్రజంట్స్ పతాకం పై భూపాల్ ,అరుణ్ , ప్రియాంక ,సంజన హీరో హీరోయిన్స్ గా D రామకృష్ణ దర్శకత్వం లో రోపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాచిలర్ పార్టీ. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ను చిత్ర యూనిట్ లాంచ్ చేసారు .

ఈ సందర్భం గా దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ ఇది ఒక యాక్షన్ వెరైటీ .ఈ చిత్రం లో అన్ని కమర్షిల్ హంగులు ఉంటాయి. మా ప్రొడ్యూసర్స్ సుబ్బారావు శ్రీనివాస్ గార్లు చక్కటి సహకారం అందించారు.మా ఆర్టిస్టులు భూపాల్ , అరుణ్ , రమణారెడ్డి చక్కగా యాక్ట్ చేసారు.ఈ చిత్రాన్ని నవంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు .

హీరో అరుణ్ కురిటి మాట్లాడుతూ ఇది నా మొదటి చిత్రం డైరెక్టర్ గారి సహకారంతో చాల చక్కగా నటించాను . అలాగే భూపాల్ , రమణారెడ్డి నా కో ఆర్టిస్టులు గా చక్కని సహకారం అందించారు ఈ చిత్రం రిలీజ్ అయ్యి మంచి పేరు తెస్తుంది అని ఆశిస్తున్నాను అని అన్నారు .
ఇంకా ఈ కార్యక్రమం లో జబర్డస్ట్ నవీన్ , రైటర్ మాణిక్యలరావు కారేపల్లి తదితరులు పాల్గొన్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు