ఒకే నెలలో రెండు హిట్లు.. రాశీ దశ తిరిగినట్టే

Raashi Khanna1

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రాశీ ఖన్నా చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ‘శ్రీనివాస కళ్యాణం’ పరాజయం తర్వాత ఆమెకు హిట్ తప్పనిసరి అయింది. ఇలాంటి క్లిష్టమైన సమయంలోనే ఆమెకు ఒకటి కాదు రెండు హిట్లు దక్కాయి. అది కూడా ఒకే నెలలో వారం వ్యవధిలో కావడం విశేషం.

కె.ఎస్.రవీంద్ర డైరెక్షన్లో ఆమె చేసిన ‘వెంకీ మామ’ చిత్రం ఈ డిసెంబర్ 13న విడుదలై మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ సినిమా విడుదలైన సరిగ్గా వారం రోజులకు 20వ తేదీన మారుతి దర్శకత్వంలో సాయి తేజ్ తో కలిసి చేసిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా అయితే మొదటిరోజే హిట్ టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా నడుస్తోంది. రెండు సినిమాల్లో రాశీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ వరుస విజయాలతో మరోసారి ఆమె లక్కీ లేడీగా మారింది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో రాశీని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. సో.. వచ్చే యేడాది రాశీ ఖన్నా బిజీ నటిగా మారిపోనుందన్న మాట.

Exit mobile version