విడుదలైన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఆడియో

విడుదలైన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఆడియో

Published on Feb 17, 2013 10:00 AM IST

BackBench-Student-(12)

మధుర శ్రీధర్ యొక్క రాబోయే సినిమా ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ ఆడియో నిన్న రాత్రి హైదరాబాద్లో విడుదల చేసారు. మహత్ రాఘవేంద్ర ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతుండగా పియా భాజ్పాయ్ మరియు అర్చనా కవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రానా, జ్వాల గుత్తా, దశరధ్, కోనా వెంకట్, బి.వి.ఎస్.రవి, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ కిషన్, నిఖితా నారాయణ్ మరియు వరుణ్ సందేశ్ హాజరయ్యి కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా మలిచారు. మహత్, పియా భాజ్పాయ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

మూడు పాటలు లాంచ్ చేసిన తరువాత వర్షం అంతరాయం కలిగించగా జ్వాలా గుత్తా చేతుల మీదగా ఆడియోని, ట్రైలర్ ని లాంచ్ చేసారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించగా, ఎం.వి.కె రెడ్డి నిర్మాత. ఈ ఆల్బమ్ లో మాస్ట్రో ఇళయరాజా ‘గీతాంజలి’ చిత్రంలో స్వరపరిచిన “జగడ జగడ” పాటకు రీ-మిక్స్ ఉండటం ప్రత్యేక ఆకర్షణ. ఈ పాటను తమిళ నటుడు శింభు పాడటం మరో విశేషం. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు