పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం తాలూకా సెకండ్ సింగిల్ రాబోతుంది అని ఈ చిత్ర మ్యూజిక్ కంపోజర్ థమన్ నుంచి హింట్ వచ్చింది.
అయితే అందులో ఎలాంటి అధికారిక సమాచారం పెట్టలేదు కానీ అంతా మాత్రం వకీల్ సాబ్ సెకండ్ సింగిల్ అనే అనుకుని చాలా ఎగ్జైటెడ్ గా ఆరోజు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు థమన్ ఈ ఫిబ్రవరి 14న వస్తుంది వకీల్ సాబ్ సెకండ్ సింగిల్ కాదని తేల్చి చెప్పేసాడు.
ఇంకా వకీల్ సాబ్ పాటల పనుల్లోనే ఉన్నామని త్వరలోనే వాటిని విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. దీనితో పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా డీలా పడ్డారు. సో వకీల్ సాబ్ సెకండ్ సింగిల్ ఈ ఫిబ్రవరి 14 న రావడం లేదు. ఇక ఈ చిత్రంలో నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తుండగా దిల్ రాజై నిర్మాణం వహిస్తున్నారు.
There is no song tats going to come on feb 14 th . We are still in completion of songs #Vakeelsaab music will update about #vakeelsaab songs very very soon guys . Our team @SVC_official working very hard to make our best . ????????????❤️ let’s celebrate it very biggggg ???????????????????? very soon https://t.co/rej4DbGWb9
— thaman S (@MusicThaman) February 9, 2021
