“బడే మియా ఛోటే మియా” డే 1 వసూళ్లు ఇవే!

“బడే మియా ఛోటే మియా” డే 1 వసూళ్లు ఇవే!

Published on Apr 12, 2024 3:47 PM IST


అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, అలయ ఎఫ్ ప్రధాన పాత్రల్లో, అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ బడే మియా ఛోటే మియా. ఈ చిత్రం నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం కి సంబందించిన డే 1 వసూళ్ల వివరాలను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 36.33 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇది సూపర్ స్టార్ట్ అని చెప్పాలి.

వాషు భగ్నాని, జాకీ భగ్నాని, అలీ అబ్బాస్ జాఫర్, దీప్శిఖా దేశ్‌ముఖ్, హిమాన్షు కిషన్ మెహ్రా లు నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ మిశ్రా సంగీతం అందించారు. మార్సిన్ లాస్కావిక్ సినిమాటోగ్రాఫర్ గా, స్టీవెన్ బెర్నార్డ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు