సమీక్ష : బడే మియా ఛోటే మియా – యాక్షన్ బాగున్నా, కథనం ఆకట్టుకోదు

సమీక్ష : బడే మియా ఛోటే మియా – యాక్షన్ బాగున్నా, కథనం ఆకట్టుకోదు

Published on Apr 12, 2024 3:03 AM IST
Sri Ranga Neethulu Movie Review in Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 11, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, అలయ ఎఫ్

దర్శకుడు: అలీ అబ్బాస్ జాఫర్

నిర్మాత: వాషు భగ్నాని, జాకీ భగ్నాని, అలీ అబ్బాస్ జాఫర్, దీప్శిఖా దేశ్‌ముఖ్, హిమాన్షు కిషన్ మెహ్రా

సంగీత దర్శకుడు: విశాల్ మిశ్రా

సినిమాటోగ్రఫీ: మార్సిన్ లాస్కావిక్

ఎడిటింగ్: స్టీవెన్ బెర్నార్డ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

చాలా కాలం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది, అయితే సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.
 

కథ:

కబీర్ (పృథ్వీరాజ్ సుకుమారన్) భారత సైన్యం నుండి ఒక ప్యాకేజీని దొంగిలించి, కొంతమంది సైనికులను చంపుతాడు. ప్యాకేజీలో రహస్య వివరాలు ఉన్నందున దేశ భద్రత ప్రమాదంలో పడింది. మిషా (మానుషి చిల్లర్) కబీర్ గ్రూప్ తో పోరాడటానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆమె విఫలమవుతుంది. కోర్టు మార్షల్ అధికారులు ఫిరోజ్ అయిన ఫ్రెడ్డీ (అక్షయ్ కుమార్), మరియు రాకేష్ అయిన రాకీ (టైగర్ ష్రాఫ్), కబీర్‌ను గుర్తించి అతనిని ఆపడానికి నియమించబడ్డారు. మిషా మరియు పామ్ (అలయ ఎఫ్) మిషన్‌లో ఫిరోజ్ మరియు రాకేష్‌లకు సహాయం చేస్తారు. ఈ కబీర్ ఎవరు? అతను భారత సైన్యానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి కారణమేమిటి? ఆ ప్యాకేజీలో ఏముంది? ఫిరోజ్, రాకేష్‌లు కబీర్‌ను అడ్డుకున్నారా? లేదా లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి.
 

ప్లస్ పాయింట్స్:

బడే మియా ఛోటే మియా లో యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. మేకర్స్ ముందుగా చెప్పినట్లు గా మంచి యాక్షన్ ఎలిమెంట్స్ అలరించాయి. యాక్షన్ సీన్స్ ను క్రెయిగ్ మాక్రే అద్భుతంగా డిజైన్ చేశారు. అవి స్క్రీన్‌ పై చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఒక యాక్షన్ బ్లాక్ విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. సెకండాఫ్ పై అంచనాలను పెంచేలా ఉంటుంది.

అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌లు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించే యాక్షన్ బ్లాక్‌ల కోసం వారు మంచి ఎఫర్ట్స్ పెట్టారు. సినిమాలో వీరి మధ్య ఉండే సన్నివేశాలు అలరిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయి. సోనాక్షి సిన్హా పాత్ర అలరిస్తుంది.
 

మైనస్ పాయింట్స్:

మంచి చిత్రాలను అందించిన అలీ అబ్బాస్‌ జాఫర్‌ వంటి దర్శకుడి నుంచి ఇలాంటి చిత్రం రావడం నిరాశ కలిగించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ గొప్ప నటుడు, కానీ అతను సినిమాలో ఎటువంటి ప్రభావం చూపలేదు. ఇందుకు సంబంధించిన సన్నివేశాలు బాగా తీయాల్సి ఉంది. మేకర్స్ టెక్నాలజీ ను ఉపయోగించి, రోటీన్ స్టోరీ ను డిఫెరెంట్ గా తీసే ప్రయత్నం చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు.

యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు సినిమా స్కేల్ చాలా పెద్దవిగా ఉన్నాయనడంలో సందేహం లేదు. కానీ సినిమా క్లిక్ అవ్వాలంటే కథాంశం బలంగా ఉండాలి. అది ఇక్కడ జరగలేదు అని చెప్పాలి. బడే మియా చోటే మియా లో, సెకండాఫ్‌లో ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ పూర్తిగా మిస్ అయింది. పఠాన్ మరియు వార్ వంటి అనేక చిత్రాలు ఇదే ఫార్మాట్‌లో ఉన్నందున, బడే మియా చోటే మియా బ్యాక్‌స్టోరీ తెలిసిన తర్వాత విసుగు పుట్టిస్తుంది.

ప్రేక్షకులు బోర్ గా ఫీల్ కాకుండా ఉండేందుకు మేకర్స్ ఈ జానర్‌లో కొత్తగా ప్రయత్నించాలి. మానుషి చిల్లర్ మరియు అలయ ఎఫ్ వారి పాత్రలు అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. రైటింగ్ మరింత బాగుండాల్సి ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదు. బాగా కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రభావం చూపలేదు. సినిమాలో సరైన లాజిక్ లేదు.

 

సాంకేతిక విభాగం:

CGI మరియు సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా కీలకం. కానీ ఇవి అంతగా ఆకట్టుకోలేదు. ఇది మెగా బడ్జెట్ సినిమా కాబట్టి టెక్నికల్ విషయాలపై మేకర్స్ మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. పాటలు కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ బాగోలేదు. విశాల్ మిశ్రా చార్ట్‌ బస్టర్‌లు వచ్చి ఉంటే, సినిమా కొంత బెటర్ గా ఉండే అవకాశం ఉంది.

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం అంతగా ఆకట్టుకోదు. అతని మునుపటి చిత్రాలను చూసిన తర్వాత అతని నుండి ఇలాంటి సినిమా ఎవరూ ఆశించరు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే పరంగా కొత్తదనం లేదు. స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

 

తీర్పు:

మొత్తం మీద, బడే మియా చోటే మియా ఒక మామూలు చిత్రంగా నిలిచింది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు బాగానే ఉన్నప్పటికీ, సరైన కథనం లేదు. అక్షయ్ కుమార్ మరియు టైగర్ ష్రాఫ్ వారి పాత్రలలో బాగా నటించి, ఆకట్టుకున్నారు. వీరి మధ్యన వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. విలన్ బ్యాక్ స్టోరీ రివీల్ అయిన తర్వాత సినిమా చాలా బోరింగ్ గా, ప్రిడిక్ట్ చేసే విధంగా మారుతుంది. సెకండాఫ్‌లో ఎంటర్టైన్మెంట్ పూర్తిగా మిస్సయింది. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకి సరైన స్క్రీన్ ప్లే లేకపోవడంతో ఎఫెక్టివ్ గా అనిపించదు. బాలీవుడ్ ఈ దేశభక్తి చిత్రాలను పెద్ద సంఖ్యలో విడుదల చేస్తోంది. అయితే కొత్తగా చూపించే విధంగా, కొత్త ఆలోచనలతో మేకర్స్ ముందుకు రావాలి. హాలిడే సీజన్ ముగిసిన తర్వాత బాక్సాఫీస్ వద్ద సినిమా హోల్డ్ అవ్వడం కష్టమే అని చెప్పాలి. .

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు