యాక్షన్ మోడ్ లో రాజమౌళి ‘బాహుబలి’

bahubali-first-look
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్ హీరో రానా దగ్గుబాటి విలన్ గా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి’. సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇటీవలే ప్రభాస్ – అనుష్కలపై ఓ సాంగ్ షూట్ చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు.

రెండు పార్ట్స్ గా రానున్న ‘బాహుబలి’ పై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. రాజమౌళి కూడా ఈ సినిమాతో ఇంటర్నేషనల్ టెక్నికల్ స్టాండర్డ్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేసి తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించనున్నాడు. అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, సుధీప్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ 2015 ఏప్రిల్ లో విడుదల కానుంది.

Exit mobile version